గుంటూరు టు అయోధ్య భక్తుల రైలును ప్రారంభించిన పురందేశ్వరి - రైలు ప్రారంభించిన పురందేశ్వరి

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 7, 2024, 4:49 PM IST

Daggubati Purandeshwari Flagged off Special Train from Guntur to Ayodhya: 13 వందల 45 మంది భక్తులతో గుంటూరు నుంచి అయోధ్య (Ayodhya) వెళ్తున్న ప్రత్యేక రైలును బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeshwari) ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. అయోధ్య రామ మందిరం నిర్మాణం కొన్ని సంవత్సరాల భారతీయుల కల అని, రామ మందిర నిర్మాణం సాకరమైన వేళ ఆ బాల రాముడిని దర్శించుకోవడం అదృష్టమని పురందేశ్వరి పేర్కొన్నారు.
Thallayapalem Shaivakshatra Siva Swamiji about Ayodhya Temple: శ్రీరాముడి ఆశీస్సులు తెలుగు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ మీద ఉండేలా ప్రార్థించాలని అయోధ్య వెళ్లుతున్న భక్తుల్ని కోరినట్లు పురేందశ్వరి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్, జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర, శివస్వామి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా హిందువుల మనోభావాల సంకల్ప బలమే అయోధ్యలో బాల రాముడి ప్రతిష్ఠ కార్యక్రమం అని తాళ్లాయపాలెం శైవక్షత్ర పీఠాధిపతి శివ స్వామీజీ పేర్కొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.