సీఎం వస్తే చెట్లు నరికేస్తారా ? ఇదెక్కడి తీరంటూ స్థానికుల ఆగ్రహం - TREES CUTTING FOR JAGAN TOUR - TREES CUTTING FOR JAGAN TOUR
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 7, 2024, 9:28 AM IST
Cutting Trees For CM Jagan Bus Yatra in Kanigiri: సీఎం జగన్ పర్యటన అంటే భద్రత పేరుతో అధికారులు పచ్చని చెట్లున్న ప్రాంతాల్ని ఎడారిలా మారుస్తున్నారని పర్యావరణ ప్రేమికులు మండిపడుతున్నారు. జగన్ పర్యటన తమ ప్రాంతంలోని చెట్లకు శాపంగా మారిందని ప్రకాశం జిల్లా కనిగిరి ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలో జగన్ పర్యటన సందర్భంగా వైసీపీ నేతలు మున్సిపల్, ఆర్అండ్బీ అధికారులు, పోలీసులను అడ్డుపెట్టుకొని చెట్లను నరికేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం జగన్ వస్తే ఏంటి గొప్ప ? ఎన్నో సంవత్సరాల నుంచి నీడనిస్తున్న వృక్షాలను తొలగించడం ఏంటని మున్సిపల్, సచివాలయ సిబ్బంది, పోలీసులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. సీఎం వస్తే చెట్లు నరికేస్తారా ఇదెక్కడి తీరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందరో ముఖ్యమంత్రులు ఇదే మార్గం గుండా పాదయాత్రలు, బస్సుయాత్రలు చేసినప్పటకీ ఇంతటి విధ్వంసం ఎవరూ చేయలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఎన్నికల అధికారులు స్పందించి యాత్రల కోసం పచ్చని చెట్లను తొలగించే ప్రక్రియను నిలుపుదల చేసి పచ్చదనాన్ని కాపాడాలని పర్యావరణ ప్రేమికులు విన్నవించుకుంటున్నారు.