రాష్ట్ర విభజనకు పదేళ్లైన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది: సీపీఐ శ్రీనివాసరావు - CPM Srinivasa Rao on YSRCP govt - CPM SRINIVASA RAO ON YSRCP GOVT
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 2, 2024, 4:36 PM IST
CPM State Secretary Srinivasa Rao allegations on YSRCP govt: రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు అయినా రాష్ట్ర పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏపీకి తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు. ఎగ్జిట్ పోల్స్‌ను విశ్వసించలేమని రెండు రోజుల్లో అసలైన ఫలితాలు వస్తాయన్నారు. నూతన ప్రభుత్వం వచ్చాక ల్యాండ్ టైటిలింగ్ యాక్త్ రద్దు చెయ్యాలన్నారు. పదేళ్లలో పాలనలో రాష్ట్రం అప్పుల మాయంగా మారిందని మండిపడ్డారు. విజయవాడ డయేరియాని కట్టడి చెయ్యడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమయిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడబోయే ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుక బడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ కోసం కృషి చేయాలని శ్రీనివాసరావు కోరారు. ప్రభుత్వ విధానాల కారణంగా ప్రజలు ఉపాధి కోల్పోతున్నారని దీనికి తోడు ప్రభుత్వం ప్రజలపై తీవ్ర భారాలు మోపుతుందని మండిపడ్డారు. చట్టా బజార్ , బెట్టింగ్‌లు, షేర్ మార్కెట్ కోసం ఎగ్జిట్ పోల్స్ చాలా సంస్థలు నిర్వహిస్తున్నాయని అన్నారు.