నియంత పాలనను గద్దె దించాలి - ప్రజలంతా ఆలోచించి ఓటు వేయాలి: సీపీఐ రామకృష్ణ - CPI RK COMMENTS ON ELECTIONS - CPI RK COMMENTS ON ELECTIONS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 23, 2024, 1:54 PM IST
CPI RK COMMENTS ON ELECTIONS: దేశం, రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే ఇండియా కూటమి అధికారంలోకి రావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (CPI Ramakrishna) అన్నారు. ఇండియా కూటమి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి జాఫర్ నామినేషన్ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, పీసీసీ మాజీ అధ్యక్షుడు శైలజానాథ్ (Sailajanath), సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతపురంలోని కృష్ణ కళామందిర్ నుంచి టవర్ క్లాక్ మీదుగా ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు.
ఎమ్మెల్యే అభ్యర్థి జాఫర్ ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తూ ప్రభుత్వాన్ని బడా బాబుల దగ్గర తాకట్టు పెడుతున్నారని రామకృష్ణ ఆరోపించారు. ప్రస్తుతం దేశంలోనూ, రాష్ట్రంలోనూ అత్యంత కీలకమైన ఎన్నికలు జరగబోతున్నాయని అన్నారు. ఇదంతా ప్రజలు గమనించాలని, ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. ప్రజలంతా ఆలోచించి ఓటు వేయాలని, నియంత పాలనను గద్దె దించాలని పిలుపునిచ్చారు.