వైఎస్సార్సీపీ హయాంలో భారీ ఎత్తున భూ కబ్జాలు- 28న భూ బాధితుల సదస్సు : సీపీఐ - CPI LEADER RAMA KRISHNA
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 23, 2024, 7:43 PM IST
CPI Leaders Rama Krishna Comment on Land Grabs in AP : రాష్ట్రంలో భారీ ఎత్తున భూ కబ్జాలు జరిగాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అధికారుల సాయంతో వేల ఎకరాలు కబ్జా చేశారని మండిపడ్డారు. వాటికి సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేయడానికి సబ్ కలెక్టర్ కార్యాలయంలోని ఫైళ్లను దగ్ధం చేసే పరిస్థితికి వచ్చారని పేర్కొన్నారు.
మాజీ మంత్రి పెద్దిరెడ్డి 982 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు పట్టా భూములుగా మార్చేసి బినామీలకు కట్టబెట్టిన అంశం ఓ పత్రికలో వచ్చినట్లు రామకృష్ణ తెలిపారు. అప్పటి చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ సహకారంతో భూ బదలాయింపు చేశారని తెలిపారు. ప్రస్తుతం ఆ అధికారి తిరుపతి కలెక్టర్గా ఉన్నారని పేర్కొన్నారు. అన్యాయం చేసిన వారే అధికారంలో ఉంటే సామాన్య ప్రజలకు న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. రాష్ట్రం జరిగిన భూ కబ్జాల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఈ నెల 28న (ఆగస్టు 28న) విజయవాడలో భూ బాధితుల సదస్సు నిర్వహిస్తామని వెల్లడించారు.