అధికారులపైనే కాదు- జగన్ మోహన్ రెడ్డిపై కూడా కేసులు పెట్టాలి - CPI leaders criticized Jagan - CPI LEADERS CRITICIZED JAGAN
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 20, 2024, 8:18 PM IST
CPI Leaders Criticized Jagan in Nellore District : వైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్రంలో జరిగిన అన్ని దౌర్జన్యాలకు, మాఫియాలకు జగనే కారణమని సీపీఐ నాయకులు విమర్శించారు. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూంటే ఆశ్చర్యం వేస్తోందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగదీష్లు ఎద్దేవా చేశారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, భూ, మద్యం, మైనింగ్ మాఫియాలన్నింటికి జగనే ముఖ్య కారకుడు అన్నారు. కాబట్టి వీటన్నింటికి కేవలం అధికారులనే బాధ్యులను చేయకుండా.. అందుకు ముఖ్యకారకుడైన జగన్ మోహన్ రెడ్డిపైనా కేసులు నమోదు చేసి విచారించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన భూ మాఫియాలపై ఈనెల 28న విజయవాడలో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అలాగే సీపీఐని స్థాపించి డిసెంబరు 26కి వందేళ్లు పూర్తి అవుతుందిని తెలిపారు. ఈ సందర్భంగా డిసెంబరు 24 నుంచి 26 వరకు దేశవ్యాప్తంగా సీపీఐ శతవార్షికోత్సవాలు జరుపుతామని వెల్లడించారు. ఈ వంద సంవత్సరాల్లో కమ్యూనిస్టుల ద్వారా దేశంలో సంభవించిన మార్పుల గురించి ప్రజలకు తెలుపుతామన్నారు.