ముంబయి నటి వ్యవహారంలో జగన్ ఎందుకు నోరు విప్పడం లేదు?: నారాయణ - NARAYANA COMMENTS ON JAGAN - NARAYANA COMMENTS ON JAGAN
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 31, 2024, 4:32 PM IST
CPI Narayana Questioned Ex CM Jagan About Mumbai Heroine Issue : ముంబయి నటి కాదంబరి జత్వానీ ఉదంతం దారుణమని, ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కదిలించిందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ అన్నారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాదంబరి విషయంపై ఇంత జరుగుతున్నా మాజీ ముఖ్యమంత్రి జగన్ నోరు విప్పడం లేదన్నారు. కాదంబరిని ఇబ్బందులకు గురి చేసిన పోలీసులను ముంబై, విజయవాడ, హైదరాబాద్ వీధుల్లో కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. శిక్షించడం వల్ల భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉంటుందన్నారు.
గుడ్లవల్లేరు కాలేజి ఘటనపై లోతుగా విచారణ చేపట్టాలని, తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. హైడ్రా కమిటీ సూచనలతో తెలంగాణాలో అక్రమ కట్టడాల నిర్మాణం తొలగింపును స్వాగతిస్తున్నామని నారాయణ అన్నారు. గురువు చంద్రబాబుని మించిన శిష్యుడిగా రేవంత్ రెడ్డి పని చేస్తున్నారన్నారు. ఏపీలో కూడా అక్రమ నిర్మాణాలు ఎన్నో ఉన్నాయని వాటిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. మదనపల్లె ఫైళ్ల దగ్ధంపై లోతైన విచారణ జరిపించి దోషులను శిక్షించాలన్నారు.