"చంద్రబాబు, లోకేశ్‌ ఫొటోలు ఉంటే కేసు ఎలా పెడతాం?"- హేళన చేసిన సీఐపై కేసు - TDP Leader Case On Police - TDP LEADER CASE ON POLICE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 17, 2024, 10:45 AM IST

Court Ordered To File Case On Police In Theft Case Of TDP Leader Gold Ring : దొంగతనం కేసులో ఆధారాలతో సహా నిందితుడ్ని పట్టించినా కేసు నమోదు చేయకపోవడంపై పోలీసులపై తిరుపతి రెండో అదనపు మున్సిపల్‌ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసుల తీరును తప్పుపడుతూ సీఐ మహేశ్వరరెడ్డిని నిందితుడిగా చేర్చి కేసు నమోదు చేయాలని ఆదేశించింది. తెలుగుదేశం నాయకుడు జయరామిరెడ్డి చంద్రబాబు, లోకేశ్​ ఫోటోలతో ఉన్న 36 గ్రమాలు ఉంగరాన్ని గతేడాది సెప్టెంబర్‌లో రోబో డైనింగ్‌ రెస్టారెంట్‌లో పోగోట్టుకున్నారు. 

దీనిపై పోలీసులకు నిందితుడిని పట్టించినా.. పట్టించుకోకపోవడమే కాకుండా ఉంగరంపై చంద్రబాబు, లోకేశ్‌ ఫొటోలు ఉన్నాకా ఎవరైనా కేసు నమోదు చేస్తారా అంటూ హేళనగా మాట్లాడారు’ అని బాధితుడు పేర్కొన్నారు. ఇక్కడ న్యాయం జరిగేలాలేదని ఆయన కోర్టును ఆశ్రయించారు. విచారణ చేసిన కోర్టు సీఐ మహేశ్వరరెడ్డిని ఏ2 గాచేర్చి కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.