'పాఠశాల అధికారుల నిర్లక్ష్యమే' - కలుషిత నీరు, ఆహారంతో 12 మంది విద్యార్థులకు అస్వస్థత - Students Fell Contaminated water

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 1, 2024, 7:37 PM IST

thumbnail
'పాఠశాల అధికారుల నిర్లక్ష్యమే' - కలుషిత నీరు, ఆహారంతో 12 మంది విద్యార్థులకు అస్వస్థత (ETV Bharat)

Contaminated Food and Drinking water 12 Students Fell Ill : వైఎస్సార్ జిల్లా కాజీపేట బాలికల ఉన్నత పాఠశాలలో కలుషిత నీరు, ఉడకని అన్నం తినడంతో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు లోనైన 12 మంది బాలికలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో కడప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాఠశాలలో ఉన్న నీటి ట్యాంకులను శుభ్రం చేయకపోవడంతోనే తాగునీరు కలుషితమైందని విద్యార్థులు తెలిపారు. నీటి ట్యాంకుపై మూత లేకపోవడంతో కోతులు నీటిని కలుషితం చేస్తున్నాయని వాటిని తాగడంతో గత మూడు రోజులుగా పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని బాలికలు తెలిపారు. 

పాఠశాల అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాలికలు వాపోయారు. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యంతోనే బాలికలు అస్వస్థతకు గురవుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందంటూ విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి బాలికల ఆరోగ్యం పరిస్థితిపై ఆరా తీశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.