LIVE : కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు - Congress Celebrate TG Formation Day - CONGRESS CELEBRATE TG FORMATION DAY
🎬 Watch Now: Feature Video
Published : Jun 2, 2024, 9:07 AM IST
Congress Celebrate TG Formation Day 2024 Live : రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్రం వచ్చి పదేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. స్వరాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను నాయకులు స్మరించుకున్నారు. తమ ప్రభుత్వం ఇంత గొప్పగా వేడుకలు నిర్వహిస్తుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొన్నదని నేతలు అంటున్నారు. ఇంత కాలం బీఆర్‌ఎస్ కబంధ హస్తాల మధ్య నలుగుతూ వచ్చిన తెలంగాణ ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నారని చెబుతున్నారు. గతంలో జరిగిన వేడుకలు బీఆర్ఎస్ వేడుకలుగా ఉన్నాయని నేతలు ఆరోపిస్తున్నారు. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమాజం వేడుకలుగా ఉన్నాయని చెబుతున్నారు. ఇందులో ఏలాంటి భేషజాలు లేవని అన్నారు. ప్రజాపాలనే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెబుతున్నారు. తాము ప్రవేశపెట్టిన పథకాలు సబ్బండ వర్గాలకు చేరేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వివరిస్తున్నారు. అర్హులందరికి ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని స్పష్టం చేస్తున్నారు.