డీఎస్సీ పోస్టులను 23వేలకు పెంచాలి- పోలీసుల సహయంతో నిరుద్యోగుల పోరాటాన్ని ఆపలేరు: ఏఐఎస్ఎఫ్

🎬 Watch Now: Feature Video

thumbnail

Concern of Unemployed to Increase The Posts of DSC: ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్​లో పోస్టుల సంఖ్యను 23వేలకు పెంచాలని, రాష్ట్రంలో మూడు ప్రైవేట్ యూనివర్శిటీలు ఏర్పాటు చేయాలని క్యాబినేట్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో 'ఛలో అసెంబ్లీ'కి పిలుపునిచ్చారు. జగన్ సర్కార్ రాష్ట్రంలో కొలువుదీరాక విడుదల చేసిన మొదటి డీఎస్సీ, నిరుద్యోగులకు తీవ్ర నిరాశ పరిచిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్ పాలనలో నిరుద్యోగం పెరిగిపోయిందని ఏఐఎస్ఎఫ్ నాయకులు విమర్శించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్దకు విద్యార్థి సంఘ నాయకులు, నిరుద్యోగులు చేరుకోగానే పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఆందోళనకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. 

పోలీసుల సహాయంతో విద్యార్థులు, నిరుద్యోగుల పోరాటాలను ఆపలేరని విద్యార్థి సంఘ నాయకులు హెచ్చరించారు. సీఎం జగన్ డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను మోసం చేశారని పలువురు నేతలు, ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో 6,100 పోస్టులను విడుదల చేసి చేతులు దులుపుకుందామని చూస్తున్నారని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో జగన్​ను ఓడించి ఇంటికి సాగనంపుతామని నిరుద్యోగులు, విద్యార్థి సంఘ నాయకులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.