'కాఫీ విత్ సత్యకుమార్' - ధర్మవరంలో పర్యటించి సమస్యలు తెలుసుకున్న మంత్రి - Minister Satya Kumar Yadav - MINISTER SATYA KUMAR YADAV
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 30, 2024, 2:23 PM IST
Coffee with Minister Satya Kumar Yadav in Dharmavaram : వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ సొంత నియోజకవర్గంలోని సత్యసాయి జిల్లా ధర్మవరంలో పర్యటించారు. స్థానిక గాంధీ నగర్‌లో రహదారి పక్కన ఉన్న టీ దుకాణానికి వెళ్లి అక్కడి ప్రజలతో మాట్లాడారు. పక్కనే ఉన్న మెట్లపై కూర్చుని కాఫీ తాగారు. స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అందరినీ ఆప్యాయంగా పలకరించారు. సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కారిస్తామని హామీ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వ వైఫల్యం వల్ల రాష్ట్రంలో పేదలకు వైద్యంతో పాటు, వైద్య విద్యార్థులకు బోధనలో నాణ్యత లోపించిందని సత్యకుమార్ ఆరోపించారు. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిని స్థానిక ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్‌తో కలసి మంత్రి పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్యకళాశాలకు అనుబంధంగా ఉన్న బోధనా ఆసుపత్రుల్లో 48 శాతం అధ్యాపకుల కొరత ఉందని వెల్లడించారు. జగన్ ప్రభుత్వం రూ. 7000 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించకుండా బకాయి పెట్టిందని విమర్శించారు.