డబ్బులిచ్చి ఆర్టీసీ బస్సుల్లో తరలించినా వెనుదిరిగిన జనం - వైసీపీ శ్రేణుల విస్మయం - cm ys jagan bus yatra - CM YS JAGAN BUS YATRA
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 21, 2024, 8:46 AM IST
|Updated : Apr 21, 2024, 10:35 PM IST
CM YS Jagan Bus Yatra: అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్ నిర్వహించిన బస్సుయాత్ర (Memantha Siddham Bus Yatra) జనం లేక వెలవెలబోయింది. శనివారం యాత్ర ప్రారంభంలోనే పట్టుమని 200 మంది కూడా లేకపోవడంతో పార్టీ వర్గాలు సైతం ఆందోళన చెందాయి. సీఎం బస్సుయాత్రతో గొడిచెర్ల, డొంకాడ, జి.జగన్నాథపురం, చీడిక కొత్తూరు, ముకుందరాజుపేట తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. తుని నుంచి విశాఖ మార్గంలో వాహనాలను నిలిపివేయడంతో దాదాపు రెండు గంటలపాటు వాహనదారులు అవస్థలు పడ్డారు.
యాత్ర పొడవునా జనం లేకపోయినా సీఎం జగన్ బస్సులో నుంచే అభివాదం చేస్తూ వెళ్లిపోయారు. సభలకు పెద్దగా స్పందన లేకపోవడంతో సీనియర్ నేతల వద్ద సీఎం అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కసింకోట మండలంలో నిర్వహించిన సిద్ధం సభలో వక్తలు ప్రసంగిస్తుండగానే జనం వెనుదిరిగారు. డబ్బులు ఇచ్చి మరీ ఆర్టీసీ బస్సుల్లో జనాన్ని తరలించినా నేతల ప్రసంగాలు వినడానికి జనం ఆసక్తి చూపకుండా బయటకు వచ్చేయడంతో వైసీపీ శ్రేణులను విస్మయానికి గురి చేసింది.