LIVE : సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి శంకుస్థాపన - Telangana Talli Statue Bhoomi Pooja - TELANGANA TALLI STATUE BHOOMI POOJA
🎬 Watch Now: Feature Video


Published : Aug 28, 2024, 11:02 AM IST
|Updated : Aug 28, 2024, 11:31 AM IST
Telangana Talli Statue Foundation Stone Live : సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు కోసం భూమి పూజ చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల సచివాలయం ప్రాంగణం పరిశీలించి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు కోసం స్థలాన్ని ఖరారు చేశారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. డిసెంబరు 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఆరోజే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రమాణ స్వీకారం చేసిన రోజున తెలంగాణ తల్లి ఉత్సవాలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే నిర్ణయించారు. ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత తెలంగాణ తల్లి రూపాన్ని ఖరారు చేయనున్నట్లు గతంలో ప్రభుత్వం తెలిపింది. అలాగే తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని సూచించిన ముఖ్యమంత్రి, పూర్తి స్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
Last Updated : Aug 28, 2024, 11:31 AM IST