జగన్ సభ కోసం 90 కి.మీ దూరం నుంచి తీసుకొచ్చారు- వృద్ధురాలి కాలును నుజ్జునుజ్జు చేశారు - CM Jagan convoy car Hit old woman - CM JAGAN CONVOY CAR HIT OLD WOMAN
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 15, 2024, 9:10 PM IST
CM Jagan Convoy Car Hit Old Woman: మేమంతా సిద్ధం అంటూ జగన్ చేస్తున్న బస్సు యాత్ర, సభలు జనానికి నరకాన్ని చూపిస్తోంది. తాజాగా సీఎం జగన్ కాన్వాయ్‌లోని వాహనం ఢీకొని ఓ వృద్ధురాలి కాలు నుజ్జునుజ్జైన ఘటన కృష్ణా జిల్లా గుడివాడలోజరిగింది. సీఎం సభ వేదిక వద్ద రోడ్డు పక్కన నిలబడ్డ కూరాకుల వెంకట నరసమ్మను సీఎం కాన్వాయ్‌లోని కారు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన వెంకటనరసమ్మను గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌కి తరలించారు. వైద్య చికిత్స చేసి కాలుకు కట్టు కట్టారు. సీఎం జగన్ సభ కోసం ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి గ్రామం నుంచి వచ్చినట్లు నరసమ్మ తెలిపారు. రోడ్డు పక్కన నిలబడి ఉండగా సీఎం కాన్వాయ్‌లోని వాహనం ఢీకొందని చెప్పారు.
మరోవైపు గుడివాడలో సీఎం బహిరంగ సభ నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు బస్సులు లేక అష్టకష్టాలు పడ్డారు. వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులను సైతం రద్దు చేసి సీఎం సభకు బస్సులను తరలించారు. అదే విధంగా ఉదయం నుంచి విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.