'అన్న వస్తున్నాడంటే ఉక్కపోతే!' - విద్యుత్​ తీగలను కట్​ చేస్తున్న అధికారులు - CM Jagan Bus Yatra - CM JAGAN BUS YATRA

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 3, 2024, 1:12 PM IST

CM Jagan Bus Yatra Kanigiri Prakasam District : సీఎం జగన్ సభలన్నా, బస్సు యాత్రలన్నా, రోడ్డు షోలన్నా ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. జిల్లాలో జగన్​ పర్యటిస్తున్నారంటే చాలు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. సీఎం వెళ్లే మార్గంలో అడ్డుగా ఉన్నా పచ్చని చెట్లు, విద్యుత్ తీగలు కనిపించకుండా అధికారులు తొలగించేస్తున్నారు. ఇవాళ సీఎం జగన్​ ప్రకాశం జిల్లా కనిగిరి పర్యటన కోసం స్థానిక అధికారులు విద్యుత్​ తీగలను తొలగించారు.

Officials Stopped Electricity Due to Jagan Bus Trip : సీఎం జగన్ సార్వత్రిక ఎన్నికల ప్రచారం నేపథ్యంలో అధికారులు సీఎం బహిరంగ సభ నిర్వహించే పామూరు బస్టాండ్​ కూడలిలో విద్యుత్​ వైర్లు, సర్వీస్​ తీగలను తొలగించారు. దీంతో సీఎం పర్యటించే రోడ్డుకు ఇరువైపుల ఉన్న ఇళ్లు, దుకాణాలకు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఫలితంగా ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఉక్కపోతతో నానా అవస్థలు పడుతున్నారు. సీఎం జగన్​ పర్యటిస్తే మాకు ఎందుకు ఈ తిప్పలని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.