LIVE: మంత్రివర్గ సమావేశంపై సీఎం చంద్రబాబు ప్రెస్మీట్ - ప్రత్యక్షప్రసారం - CM CHANDRABABU PRESS MEET LIVE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 16, 2024, 5:38 PM IST
|Updated : Oct 16, 2024, 7:23 PM IST
CM Chandrababu Press Meet Live: సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసిన తరువాత సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడనున్నారు. సమావేశంలో చర్చించిన అంశాల గురించి వివరించనున్నారు. AP Cabinet Meeting: ముందుగా సమావైశంలో వివిధ శాఖలు రూపొందించిన నూతన పాలసీలు, ప్రతిపాదనలపై మంత్రివర్గం చర్చించింది. రాష్ట్రంలో పునరుద్పాదక విద్యుత్, పంప్డ్ స్టోరేజీ ద్వారా విద్యుత్ ఉత్పత్తి, గ్రీన్ హైడ్రోజన్ లాంటి వనరుల వినియోగం పెంచేలా ఏపీ క్లీన్ ఎనర్జీ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. 2024-29 రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి పాలసీ 4.0పై చర్చించి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. 20 లక్షల ఉద్యోగాలు కల్పన, పారిశ్రామిక ప్రోత్సాహకాలను ఎస్క్రో ఖాతాలో వేసే విధంగా పారిశ్రామిక పాలసీ 4.0 ని రూపొందించారు. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ పైనా రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించారు. 2030 నాటికి ఇంటింటికీ ఓ పారిశ్రామిక వేత్త అనే అంశంతో నూతన ఎంఎస్ఎంఈ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల్ని ప్రోత్సహించేలా కొత్త పాలసీపై మంత్రివర్గంలో చర్చించి ఆమోదం తెలిపారు.
Last Updated : Oct 16, 2024, 7:23 PM IST