LIVE: మంగళగిరిలో గురుపౌర్ణమి వేడుకలు- హాజరైన సీఎం చంద్రబాబు - ప్రత్యక్ష ప్రసారం - cm cbn in Guru Purnima Celebrations - CM CBN IN GURU PURNIMA CELEBRATIONS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 21, 2024, 11:39 AM IST
|Updated : Jul 21, 2024, 12:22 PM IST
CM Chandrababu in Guru Purnima Celebrations: రాష్ట్ర వ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. గురువుకు సమాజంలో అత్యుత్తమ స్థానం ఇవ్వడం సంప్రదాయం. గురువును బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడిగా పూజించడం ఆనవాయితీగా వస్తోంది. అజ్ఞానం, అంధకారాన్ని పోగొట్టి, జ్ఞానజ్యోతులు వెలిగించే వ్యక్తే గురువు. ఆషాఢమాసంలో వచ్చే పౌర్ణమిని గురుపౌర్ణమిగా జరుపుకోవడం ఆచారం. ఈ రోజు వేదాలు రచించిన వ్యాసుడు జన్మించిన రోజుగా ప్రజలు భావిస్తారు. జగతిని జాగృతపరిచిన గురుదేవులను ఈ రోజు పూజించడం ఆనవాయితీగా వస్తోంది. గురుపౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని సాయినాథుడి ఆలయాలన్నీ భక్తులతో రద్దీగా మారాయి. గురు పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సత్యం, ధర్మం, దయ, ధ్యానం ద్వారా సమున్నత జీవన గమ్యాన్ని ఏర్పరచుకోవాలన్న వేదవ్యాసుడి ఉపదేశాన్ని అనుసరిస్తూ గురువుల పట్ల అత్యంత గౌరవంతో మెలగాలన్నారు. ప్రజలంతా మహోన్నత ఆశయాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో గురు పౌర్ణమి వేడుకలు జరుగుతున్నాయి. ఈ గురు పౌర్ణమి మహోత్సవంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ప్రత్యక్ష ప్రసారం.
Last Updated : Jul 21, 2024, 12:22 PM IST