ఇంఛార్జ్ మార్పుతో రగులుకున్న వర్గపోరు- బాబురావుకే టికెట్ ఇవ్వాలంటూ డిమాండ్ - వైఎస్సార్సపీలో వర్గపోరు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 7, 2024, 3:20 PM IST

Class War in YSRCP in kanigiri Constituency: ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీలో వర్గపోరు రోజురోజుకూ రగులుతూనే ఉంది. జడ్పీటీసీ దద్దాల నారాయణను నియోజకవర్గ ఇంఛార్జ్​గా ఎలా నియమిస్తారని వైఎస్సార్సీపీ అసమ్మతి వర్గం మండిపడింది. మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావుకే టికెట్ ఇవ్వాలంటూ చంద్రశేఖరపురం మండలం శీలంవారి పల్లిలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాబురావు హాజరయ్యారు. వార్డు మెంబర్​ లాగా ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నారని అధికార వైఎస్సార్సీపీ అసమ్మతి నాయకులు మండిపడ్డారు. అభ్యర్థి బాబురావు అయితేనే తమ మద్దతు ఉంటుందని తేల్చి చెప్పారు. 

మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావుకి కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా ఓటమి ఖాయమన్నారు. అభ్యర్థులు గెలవకుండా జగన్ ముఖ్యమంత్రి ఎలా అవుతారని ప్రశ్నించారు. కదిరి బాబురావు బలపరీక్ష పెట్టారని తీర్మానం చేశారు. కాగా ఇప్పటికే ఈ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్​కు మద్దతుగా ఓ వర్గం, మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావుకు మద్దతుగా మరో వర్గం ఏర్పడింది. ఇప్పుడు వీరిద్దరినీ కాదని అధిష్ఠానం జడ్పీటీసీ దద్దాల నారాయణను నియోజకవర్గ ఇంఛార్జ్​గా నియమించడంతో మూడుముక్కలాట తీవ్ర స్థాయికి చేరింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.