'ఆడుదాం ఆంధ్రా' పోటీల్లో ఘర్షణ - కుర్చీలతో దాడి చేసుకున్న ఆటగాళ్లు - Clashes between two teams
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 25, 2024, 8:59 AM IST
Clashes Between Players In Aadudam Andhra Tournament in Nandyala district : నంద్యాల పట్టణం పద్మావతి నగర్లోని ఇండోర్ స్టేడియంలో బుధవారం నిర్వహించిన 'ఆడుదాం ఆంధ్రా' పోటీల్లో ఘర్షణ చోటుచేసుకుంది. నంద్యాల మండలంలోని కొత్తపల్లె జట్టు, పట్టణంలోని తెలుగుపేట జట్ల మధ్య బుధవారం కబడ్డీ ఫైనల్ మ్యాచ్ పోటీ జరిగింది. ఈ పోటీల్లో కొత్త పల్లె జట్టు విజేతగా నిలిచింది. విజేత జట్టు సభ్యులను అభినందించే సమయంలో ప్రత్యర్ధి జట్టు సభ్యులు వేదిక పైకి కుర్చీలు విసిరివేశారు. దీంతో ఇరుజట్ల మధ్య గొడవ నెలకొంది.
రెండు జట్ల సభ్యులు పరస్పరం కూర్చీలు, బల్లలతో ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడులు చేసుకున్నారు. ఈ దాడుల సమయంలో అక్కడ పోలీసులు ఎవరు లేకపోవడంతో ఘర్షణ తీవ్రత ఎక్కువగా ఉంది. రెండు జట్లు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో క్రీడా ప్రాంగణం రణరంగాన్ని తలపించింది. ఈ ఘర్షణలో పలువురు క్రీడాకారులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.