పండుగ వేళ కూడా రాజకీయాలేనా- ఆలయంలో బాహాబాహీకి దిగిన నేతలు - CLASH BETWEEN LEADERS AT TEMPLE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 12, 2024, 5:52 PM IST
Clash between leaders at Temple: రాజకీయంగా ఎన్ని విభేదాలు ఉన్నా, ఆలయానికి వచ్చిన తరువాత చాలా మంది నాయకులు ప్రశాంతంగా దర్శనం చేసుకుని వెళ్లిపోతారు. ఆలయాల వద్ద ఎటువంటి రాజకీయాలు చేయడం గానీ, ప్రకటనలు గానీ చేయరు. అయితే కొంతమంది మాత్రం తాము భిన్నం అంటూ నిరూపిస్తూ ఉంటారు. తాజాగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని ఇద్దరు నాయుకులు ఇదే విధంగా ప్రవర్తించారు. ఆలయం వద్దే ఘర్షణకు పాల్పడ్డారు.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని భాస్కరపేటలో వెలసిన చాముండేశ్వరి దేవి ఆలయం వద్ద ఇద్దరు నేతలు బాహాబాహీకి దిగారు. మున్సిపల్ మాజీ ఛైర్మన్ ముత్యాల పార్థసారథి, టౌన్ బ్యాంక్ మాజీ వైస్ ఛైర్మన్ పులి రామచంద్ర మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆలయానికి వచ్చిన ఇద్దరు నేతలు, ఆలయ వ్యవహారంలో ఘర్షణకు దిగారు. దీంతో నేతల ఘర్షణతో ఆలయానికి చేరుకున్న భక్తులు భయాందోళనకు గురయ్యారు. ఆలయానికి వచ్చిన భక్తులు భయంతో పరుగులు తీశారు.