ఎన్నికల ప్రచారంలో వైసీపీ-టీడీపీ వర్గీయుల ఘర్షణ- ఎమ్మెల్యే సతీమణికి గాయాలు - Clash Between TDP and YCP
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 8, 2024, 10:56 PM IST
Clash Between TDP and YCP Groups During Election Campaign: ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్సార్సీపీ రౌడీ రాజకీయాలకు తెరలేపుతోంది. టీడీపీ నేతలపై కార్యకర్తలపై వైసీపీ నేతలు ఇష్టానుసారంగా దాడులు చేస్తున్నారు. తాజాగా పల్నాడు జిల్లాలో ఎన్నికల ర్యాలీ నేపథ్యంలో టీడీపీ నేతలపై వైసీపీ నాయకులు కవ్వింపు చర్యలకు దిగారు. ఈ క్రమంలో రెండు పార్టీల వారి మధ్య వాగ్వాదం జరిగింది.
పల్నాడులో ఎన్నికలు రోజురోజుకు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఎక్కడ ఏ ఘర్షణ జరుగుతుందో అని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎన్నికల ప్రచారంలో కవ్వింపు చర్యలు, దాడులు నిత్యకృత్యమయ్యాయి. జిల్లాలోని వెల్దుర్తి మండలం సిరిగిరిపాడులో తెలుగుదేశం, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణి రమా ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహిస్తుండగా ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకోగా ఎమ్మెల్యే సతీమణితోపాటు మరికొందరికి గాయాలయ్యాయి. ఈ దాడిలో వెల్దుర్తి ఎస్సై శ్రీహరి తలకు సైతం గాయమైంది. ఈ దాడిలో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. జరిగిన ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.