ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాలి - ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకూడదు: సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ - Voter Awareness Program

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 10, 2024, 9:55 PM IST

Citizens for Democracy Election Awareness Program : ఎలాంటి బెదిరింపులు, దాడులు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగినప్పుడే ఓటర్లు తమకు నచ్చిన నాయకుడికి స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం ఉంటుందని విశ్రాంత ఐఏఎస్ అధికారి జీవీ కృష్ణారావు అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాలని, ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురిచేయకూడదని తెలిపారు. గుంటూరు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల అవగాహన కార్యక్రమంలో కృష్ణా రావు పాల్గొన్నారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా రాజకీయ నేతలు వ్యవహరించకూడదని అన్నారు. పోలింగ్ సమయంలో ఇబ్బందులు, అవాంఛనీయ ఘటనలు జరిగిన సీఎఫ్‌డీకి ఫోన్‌ చేసి సందేశం ఇవ్వాలని సూచించారు. 

ఎలాంటి ఇబ్బందులున్నా సంప్రదించవచ్చు : రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, దాడులు జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కృషి చేస్తోందని జీవీ కృష్ణారావు తెలిపారు. పోలింగ్​కు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు, అవాంఛనీయ ఘటనలు జరిగినా  8187828777 ఫోన్ నంబర్​కు కాల్ చేసి, లేదా సందేశం పంపి తమ దృష్టికి తీసుకురావచ్చునని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.