కొత్తమాసు సత్రం నిధులు సొంతానికి వాడేశారు- చీరాల గ్రూపు టెంపుల్స్​ ఈవోపై సస్పెన్షన్​ వేటు - Chirala Group Temples EO Suspend - CHIRALA GROUP TEMPLES EO SUSPEND

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 29, 2024, 1:11 PM IST

Chirala Group Temples EO Suspend in Bapatla : బాపట్ల జిల్లా చీరాల గ్రూపు టెంపుల్స్ ఈవో జీవీఎల్​ కుమార్‌ నిధుల దుర్వినియోగానికి పాల్పడటంతో అధికారులు సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఆయన్ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనరు మహేశ్వరరెడ్డి తెలిపారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో చీరాలలో ఉన్న కొత్తమాసు సత్రానికి సంబంధించిన రూ. 32 లక్షలు ఎటువంటి అనుమతుల్లేకుండానే ఈవో (EO) డ్రా చేసినట్లు గతంలో దానికి ట్రస్టీగా ఉన్న నేరేళ్ల గోపాలం ఇటీవల ఫిర్యాదు చేశారు. 

EO Suspend in Bapatla Due to Misappropriation of funds : దీనిపై విచారణ జరిపిన అధికారులు ఇది వాస్తవమని తేలడంతో కుమార్‌ను సస్పెండ్‌ (Suspend) చేశామన్నారు. నేరానికి గానూ అతనిపై క్రిమినల్ కేసు పెడతామన్నారు. అతడిని విధుల నుంచి తొలగించడంలో ప్రస్తుతం చీరాల గ్రూప్‌ టెంపుల్స్‌ ఇన్‌ఛార్జ్‌గా (Incharge) శ్రీనివాసరావును నియమించినట్లు అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.