కరణంకు అనుకూలంగా వ్యవహరిస్తే డీఎస్పీని చెట్టుకు కట్టేస్తాం - ఆమంచి కృష్ణమోహన్ ఫైర్​ - amanchi krishna mohan fires on DSP - AMANCHI KRISHNA MOHAN FIRES ON DSP

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 10, 2024, 10:55 AM IST

Amanchi Krishna Mohan Fires on DSP: బాపట్ల జిల్లా చీరాల డీఎస్పీ బేతపూడి ప్రసాద్ ఎన్నికల్లో ఏకపక్షంగా వ్యవహరిస్తూ తమను ఇబ్బంది పెట్టేందుకు యత్నిస్తున్నారని కాంగ్రెస్‌ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ ఆరోపించారు. ఎమ్మెల్యే కరణం బలరాం అనుచరుడిగా డీఎస్పీ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.  కటారిపాలెంలో తనకు మద్దతు ఇస్తున్న మత్స్యకారుల ఇళ్లల్లో అనవసరంగా కార్డెన్ సెర్చ్ నిర్వహించి వారిని భయాందోళనకు గురి చేశారని విమర్శించారు. కరణం బలరాంకు అనుకూలంగా వ్యవహరిస్తే డీఎస్పీని చెట్టుకు కట్టేస్తామని హెచ్చరించారు. 

ఎన్నికల్లో తనకు అనుకూలంగా పని చేయడానికే ఎమ్మెల్యే కరణం బలరాం డీఎస్పీ ప్రసాద్​కి చీరాలలో పోస్టింగ్ ఇప్పించారని ఆరోపించారు. గత ఎన్నికలప్పుడు చీరాలలో సీఐగా ఉన్న ప్రసాద్ ఆ సమయంలో కరణం బలరాంకు అనుకూలంగా పని చేశారని ఆరోపించారు. కటారిపాలానికి చెందిన వెంకటేశ్వర్లు పొలం విక్రయించగా కొనుగోలుదారులు రూ. 25 లక్షల నగదును చీరాల హెచ్​డీఎఫ్​సీ బ్యాంకులో జమ చేశారని తెలిపారు. వెంకటేశ్వర్లు విడతల వారీగా నగదు డ్రా చేసుకొని ఇంట్లో ఉంచుకున్నారని, వైఎస్సార్సీపీ అభ్యర్థి కరణం వెంకటేష్​కు కాకుండా కటారిపాలెం వాసులు తనకు మద్దతు ఇస్తున్నారు అనే కక్షతో కార్డెన్ సెర్చ్ చేసి భయభ్రాంతులకు గురి చేశారని ఆమంచి ఆరోపించారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్‌లో ఆయన ఫిర్యాదు చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.