వైఎస్సార్ పేరు తీసేసి ఎన్టీఆర్ వ్యాయామశాలగా మార్పు - Changes in Guntur NTR Stadium - CHANGES IN GUNTUR NTR STADIUM
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 9, 2024, 2:23 PM IST
Changes in Guntur NTR Stadium : గుంటూరు ఎన్టీఆర్ స్టేడియంలో ఎన్నికల వేళ హడావుడిగా ప్రారంభించిన వ్యాయామశాల శిలాఫలకాలను బ్రహ్మణ చైతన్య వేదిక, తెలుగుదేశం ఆధ్వర్యంలో తొలగించారు. వైఎస్సార్ పేరు తీసేసి ఎన్టీఆర్ వ్యాయామశాలగా మార్చారు. నూతన భవనంపై హైకోర్టులో కేసు ఉండగా నిబంధనలకు విరుద్ధంగా ప్రారంభించారని బ్రాహ్మణ చైతన్య వేదిక నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
YSRCP Stone tablets Removed in NTR Stadium Guntur : నూతన భవనానికి సంబంధించిన కేసు న్యాయస్థానంలో ఉండగానే నిబంధనలకు విరుద్ధంగా విడదల రజని, మద్దాలి గిరి, కావటి మనోహర్ నాయుడు, లేళ్ల అప్పిరెడ్డి ఎన్నికలకు ముందు తమ పేర్ల మీద శిలాఫలకాలు వేసుకుని అసంపూర్తిగా ఉన్న జిమ్‌ను ప్రారంభించారు. ఎన్నో ఏళ్లుగా వాడుకలో ఉన్న ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలోని నూతన జిమ్‌కు ఆయన పేరు ఉండాలని తేల్చి చెప్పారు. ఎన్టీఆర్ జిమ్ అనే అక్షరాలను ఏర్పాటు చేసి కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.