మార్చి 2నుంచి రా కదలి రా సభలు - సిద్ధమైన చంద్రబాబు - Chandrababu tours
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 29, 2024, 12:44 PM IST
Chandrababu Ra Kadali Ra Public Meetings: తెలుగుదేశం అధినేత చంద్రబాబు వరుస పర్యటనలు చేపట్టనున్నారు. మార్చి 2వ తేదీ నెల్లూరు, గురజాలలో ఆయన పర్యటించనున్నారు. 2వ తేదీ ఉదయం నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరనున్నారు. అదే రోజు మధ్మాహ్నం గురజాలలో రా కదలి రా సభలో ఆయన పాల్గొననున్నారు. 4 వ తేదీ రాప్తాడు నియోజకవర్గంలో రా కదలి రా సభలో అధినేత పాల్గొననున్నారు. ఇప్పటికి 22 రా కదలి రా సభల్లో పాల్గొన్నారు. ప్రతి పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ ఒక రా కదలి రా సభను నిర్వహిస్తుంది.
రాష్ట్రాన్ని చీకటిమయం చేసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆందోళనప్రదేశ్‌గా మార్చిన దుర్మార్గుడు జగన్ మోహన్ రెడ్డి అని, వైఎస్సార్సీపీ పాలనకు చరమగీతం పాడదామంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు 'రా కదలి రా పేరిట ఎన్నికల ప్రచార పర్వాన్ని మొదలుపెట్టారు. రోజుకు రెండు చొప్పున జరిగే ఈ సభలకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరై అధికార పార్టీ నేతలు అక్రమాలను, అరాచకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నారు.