LIVE: నంద్యాల ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగం - ప్రత్యక్ష ప్రసారం - chandrababu praja galam meeting - CHANDRABABU PRAJA GALAM MEETING
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 11, 2024, 1:14 PM IST
|Updated : May 11, 2024, 2:10 PM IST
Chandrababu Praja Galam Meeting: తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం తుది దశకు చేరింది. రాష్ట్రంలో విధ్వంస పాలనకు చరమగీతం పాడి ఏపీని మళ్లీ గాడిలో పెడదాం అనే నినాదంతో కాలికి బలపం కట్టుకుని ఆయన రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేశారు. రాష్ట్ర భవిత కోసం, బిడ్డల భవిష్యత్ కోసం కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలంటూ ప్రజలను అభ్యర్థించారు. అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన సంక్షేమంతో పాటు రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తామని భరోసా కల్పించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు రికార్డు స్థాయి పర్యటనలు జరిపారు. ఏడు పదుల వయస్సు దాటినా రెట్టింపు కసితో అలుపెరగని యువకుడిలా గతం కంటే ఎక్కువగా సభలు, రోడ్‌షోలు, సమావేశాల్లో పాల్గొన్నారు. విరామం, విశ్రాంతి అనేది దరి చేరనియకుండా రోజుకు 3 నుంచి 5 సభల్లో పాల్గొంటూనే, అంతర్గత సమావేశాలు,కూటమి పార్టీలను సమన్వయం చేసుకున్నారు. నేడు ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో నంద్యాల, చిత్తూరులలో ప్రజాగళం సభలు నిర్వహించి ప్రచార పర్వానికి ముగింపు పలకనున్నారు. సాయంత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకోనున్నారు. ప్రస్తుతం నంద్యాల ప్రజాగళం సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం.
Last Updated : May 11, 2024, 2:10 PM IST