LIVE: శ్రీకాళహస్తి ప్రజాగళం సభలో చంద్రబాబు - ప్రత్యక్షప్రసారం - Chandrababu live updates - CHANDRABABU LIVE UPDATES

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 30, 2024, 6:51 PM IST

Updated : Mar 30, 2024, 7:51 PM IST

Chandrababu Praja Galam Live : ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు శ్రీకాళహస్తిలో చంద్రబాబు రోడ్ షోలు, ప్రజాగళం సభల్లో పాల్గొని ప్రసంగిస్తున్నారు. ఉదయం ప్రొద్దుటూరు పాల్గొన్న చంద్రబాబు సీఎం జగన్​పై నిప్పులు చెరిగారు. జగన్‌ ఇంటికి పోవడం ఖాయమని చంద్రబాబు నాయుడు అన్నారు. ఐదేళ్లలో రాయలసీమకు ఏం చేశారో చెప్పాలని సవాల్‌ విసిరారు. ప్రొద్దుటూరు ప్రజాగళం ప్రచార సభలో చంద్రబాబు ప్రసంగించారు."జగన్‌కు రాయలసీమ అంటే హింస, హత్యా రాజకీయాలు టీడీపీకు సీమ అంటే నీళ్లు, ప్రాజెక్టులు, పరిశ్రమలు. రైతును రాజు చేయడం టీడీపీ సంకల్పం. పులివెందుల ప్రజలు కూడా జగన్‌ను నమ్మేది లేదంటున్నారు. విపరీతమైన మార్పు వచ్చింది. ట్రెండ్‌ మారింది. వైసీపీ బెండు తీస్తారు. వైసీపీ నేతల దాడులకు టీడీపీ కార్యకర్తలు భయపడలేదు. కడపకు స్టీల్‌ప్లాంట్‌ వచ్చి ఉంటే వేలమందికి ఉద్యోగాలు వచ్చేవి. శంకుస్థాపనలు కాదు. ప్రారంభోత్సవాలు జరగాలి. రాయలసీమకు మేం కియా మోటార్స్‌ తీసుకొచ్చాం. కరవుసీమలో తయారైన 12 లక్షల కార్లు ప్రపంచంలో పరిగెడుతున్నాయి. నా బ్రాండ్‌ కియా మోటార్స్‌ తేవడం జగన్‌ బ్రాండ్‌ వేసిన స్టీల్‌ప్లాంట్‌కు మళ్లీ శంకుస్థాపన చేయడం! పరిశ్రమలు తేకపోగా ఉన్నవాటిని తరిమేశారు" అని చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం శ్రీకాళహస్తిలో చంద్రబాబు ప్రజాగళం ప్రత్యక్ష ప్రసారం మీకోసం.
Last Updated : Mar 30, 2024, 7:51 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.