అమరావతే ఏకైక రాజధాని- విశాఖను ప్రత్యేకంగా తీర్చిదిద్దుకుందాం: చంద్రబాబు - Andhra Pradesh capital Amaravati - ANDHRA PRADESH CAPITAL AMARAVATI
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-06-2024/640-480-21686829-thumbnail-16x9--andhra.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 11, 2024, 5:05 PM IST
Andhra Pradesh capital Amaravati: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతే అని తెలుగుదేశం అధినేత, కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. ప్రజావేదికలా విధ్వంస రాజకీయాలు కాకుండా, నిర్మాణాత్మకంగా అభివృద్ధి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. విజయవాడలో జరిగిన ఎన్డీఏ పక్ష నాయకుల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. శాసనసభ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక రాష్ట్రాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందన్నారు.
పవన్ కల్యాణ్‌కు హోదాపై రేపు స్పష్టత వస్తుందని స్పష్టం చేశారు. తమకు హోదా ప్రజలకు సేవ చేయడం కోసమేనని ఆయన తెలిపారు. సీఎం కూడా మామూలు మనిషేనన్న చంద్రబాబు, ఇక పరదాలు కట్టటం, దుకాణాలు బంద్ చేయటం, ట్రాఫిక్ నిలిపి వేయటం, చెట్లు నరకటం లాంటివి ఉండదన్నారు. కూటమికి లభించింది విజయం కాదని ప్రజలకు సేవ చేసే బాధ్యత అని చంద్రబాబు పేర్కొన్నారు. పేద ప్రజల జీవితాలు మార్చే దిశగా కృషి చేసి వారికి మనపై ఉన్న నమ్మకాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు.