పేద మహిళపై వైఎస్సార్సీపీ నాయకుల దాడి దారుణం: చంద్రబాబు - మహిళపై వైఎస్సార్సీపీ నేతల దాడి
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 21, 2024, 1:20 PM IST
Chandra Babu Condemned YSRCP Leaders Attack On Woman: తెలుగుదేశం నేతలకు తన సమస్య చెప్పిందని వితంతు మహిళ (widow)పై వైఎస్సార్సీపీ నాయకులు మూక దాడి చేశారు. ఈ దాడిలో మహిళ కంటిచూపు కోల్పోవడంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో భర్త లేకపోయినా దివ్యాంగుడైన కొడుకుతో జీవితాన్ని గడుపుతున్న ఒక పేద మహిళపై ఇంతటి దాష్టీకమా అని చంద్రబాబు ఆగ్రహం (chandra babu fired) వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు, మీడియాతో పాటు సామాన్య ప్రజలపైనా వైఎస్సార్సీపీ దాడులు నిత్యకృత్యం అయిన మన రాష్ట్రం ఎటుపోతుందో ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. వైఎస్సార్సీపీ నరహంతక పాలనలో రాష్ట్రం పూర్తిగా రాతియుగంలోకి వెళ్లిపోయిందని చంద్రబాబు దుయ్యబట్టారు. Woman Lost Eye sight in Attack of YSRCP Leaders: అసమ్మతి గళాలపై దాడులను, అరాచకాన్ని ముఖ్యమంత్రే ప్రోత్సహిస్తుండటంతో వైఎస్సార్సీపీ రౌడీ మూకలకు అడ్డు లేకుండా పోయిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి స్పందించి బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.