వాలంటీర్లతో రాజీనామా చేయించి పోలింగ్ ఏజెంట్లుగా నియమించుకోవడం సరికాదు: సీఎఫ్డీ - CFD Demands Remove Volunteers - CFD DEMANDS REMOVE VOLUNTEERS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 16, 2024, 11:51 AM IST
CFD Demands Remove Volunteers As YSRCP Adviser : మే నెలకు సంబంధించిన పింఛన్లు 1-2 తేదీల్లోపే ఇంటింటికీ పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని సిటిజెన్స్ ఫర్ డెమోక్రసీ విజ్ఞప్తి చేసింది. పింఛన్ల విషయంలో ఎన్నికల సంఘం (Election Commission) ఆదేశాలను వక్రీకరించేలా కొందరు వ్యవహరించారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో సీఎఫ్డీని దోషిగా చూపేందుకు ప్రయత్నాలు చేశారన్నారు. వాలంటీర్లతో రాజీనామా చేయించి పోలింగ్ ఏజెంట్లుగా నియమించుకోవడం సరికాదని సీఎఫ్డీ కన్వీనర్ లక్ష్మణ రెడ్డి అన్నారు.
'ఇప్పటి వరకూ ప్రజాధనం జీతంగా తీసుకుంటున్న వాలంటీర్లను రాజీనామా చేయించి పోలింగ్ ఏజెంట్లుగా నియమించుకోవడమూ సరికాదు. ఈ తరహా రాజకీయ లబ్ది పొందాలనుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. గత ఐదు సంవత్సరాలుగా ప్రజాధనంతో వేతనాలు తీసుకుంటున్న 46 మంది సలహాదారులు రాజకీయాలు మాట్లాడటకూడదు. వీరిని రాజకీయాలు మాట్లాడకుండా నిలువరించాలి లేదా వారిని సలహాదారుల పదవి నుంచి తప్పించాలని సీఎఫ్డీ తరపున డిమాండ్ చేస్తున్నాం.' -సీఎఫ్డీ కన్వీనర్ లక్ష్మణ రెడ్డి