ఎన్నికల ప్రక్రియకు సిద్ధం కావాలి - ప్రతిరోజు నివేదికలివ్వాలి: కలెక్టర్లకు సీఈవో ఆదేశం - MUKESH KUMAR REVIEW WITH COLLECTORS - MUKESH KUMAR REVIEW WITH COLLECTORS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 17, 2024, 7:44 AM IST
CEO Mukesh Kumar Meena Reviews With Collectors: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈ నెల 18న నోటిఫికేషన్ జారీ కానున్న నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియకు సిద్ధం కావాలని ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ప్రతీరోజూ నివేదికలు పంపాలని ఆయన సూచించారు. సున్నితమైన ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలను వెబ్ క్యాస్టింగ్ ద్వారా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎన్నికలు శాంతియుత వాతవారణంలో జరిగేందుకు వీలుగా కార్యాచరణ చేపట్టాలని సూచించారు.
సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించిన మీనా ఓటర్ల గుర్తింపు కార్డులను పంపిణీ చేయటంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. సీ-విజిల్ యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులను తక్షణం పరిష్కరించాలని అధికారుల సూచించారు. కోనసీమ, పల్నాడు, ప్రకాశం, సత్యసాయి, పశ్చిమగోదావరి లాంటి జిల్లాల్లో నగదు, మద్యం, ఉచితాలు, అక్రమ రవాణాను అడ్డుకోవటంలో వెనుకబడి ఉన్నామని సీఈఓ ఆయా జిల్లా కలెక్టర్ల నుంచి వివరణ కోరారు. అన్ని జిల్లాలు ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టం అమలుపై దృష్టి పెట్టాలని మీనా సూచించారు.