ఇంద్రకీలాద్రిని సందర్శించిన బీజేపీ నేతలు- కనకదుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు - Central Minister VisitDurga Temple

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 11, 2024, 1:24 PM IST

Central Minister Gajendra Singh Visit in Kanaka Durga Temple: జనసేన- తెలుగుదేశం నేతలతో చర్చించి అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసేందుకు విజయవాడ వచ్చిన కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ఎంపీ బైజయంత్‌ పండా ఈ ఉదయం ఇంద్రకీలాద్రిని సందర్శించారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ వీరిని కనకదుర్గమ్మ ఆలయానికి తీసుకెళ్లారు. దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం తరఫున అధికారులు, పండితులు కేంద్ర మంత్రికి సాదర స్వాగతం పలికారు. కేంద్ర మంత్రి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం పండితులు వేద ఆశీర్వచనం చేసి అమ్మవారి ప్రసాదాన్ని అందించారు. షెకావత్‌, పండాతో నిన్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భేటీ అయ్యారు. నేడు మూడు పార్టీల నేతలు సమావేశమై అభ్యర్ధుల ఎంపిక అంశాన్ని ఓ కొలిక్కి తీసుకురానున్నారు.

ఏపీలో మూడు పార్టీల మధ్య పొత్తు పొడిచిన వేళ రాష్ట్ర రాజకీయాలు మరింత ఆసక్తిరంగా మారాయి. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసే సీట్లపై చర్చించనున్నారు. త్వరలో రాష్ట్రంలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారనే సంకేతాలను చంద్రబాబు ఇచ్చారు. ఈ నెలలో జరగబోయే టీడీపీ, జనసేన భారీ బహిరంగ సభకు మోదీ హాజరు కానున్నారని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.