రాష్ట్రంలో క్షిపణి పరిశోధనా కేంద్రం - అవనిగడ్డ ఎమ్మెల్యే ఏమన్నారంటే! - MISSILE RESEARCH CENTER IN AP

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 14, 2024, 5:39 PM IST

Missile Research Center in Nagayalanka of ​​Krishna District : కృష్ణా జిల్లా నాగాయలంక ప్రాంతంలో క్షిపణి పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు కేంద్రం ప్రభుత్వం ఆమోదం తెలపడం హర్షణీయమని డీఆర్డీఓ చైర్మన్, రక్షణశాఖ సలహాదారు డాక్టర్ జీ. సతీష్ రెడ్డి అన్నారు. రాబోయే కాలంలో అనేక క్షిపణులను పరిశోధన జరిపేందుకు వేల కోట్ల రూపాయలు వెచ్చించి క్షిపణి పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. దీని ద్వారా అనుబంధ పరిశ్రమలు, అనేక మందికి ఉద్యోగాలు అవకాశాలు లభిస్తాయన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి, పరిశోధన కేంద్రం ఏర్పాటుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

నాగాయలంక ప్రాంతంలో క్షిపణి పరిశోధన కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేయడం పట్ల అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. సుమారు 30 వేల కోట్ల రూపాయలను ఈ పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు కేంద్రం వెచ్చించనున్నట్లు చెప్పారు. డీఆర్డీఓ చైర్మన్ డాక్టర్ జి.సతీష్ రెడ్డి అవిశ్రాంత కృషి ఫలితంగానే క్షిపణి పరిశోధనా కేంద్రం మంజూరైనట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.