ఎన్నికల పరిశీలకులకు సీఈసీ శిక్షణ- నాలుగు రోజుల్లో షెడ్యూల్ ప్రకటన! - CEC conducts training program

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 11, 2024, 1:31 PM IST

CEC Conducts Training Program for Central Observers of the State : రాష్ట్రానికి చెందిన కేంద్ర పరిశీలకులకు సీఈసీ (Chief Election Commission) శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తుంది. నాలుగైదు రోజుల్లో ఎన్నికల షెడ్యూలు ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి కేటాయించిన 66 మంది కేంద్ర ఎన్నికల పరిశీలకులకు భారత ఎన్నికల సంఘం అధికారులు వీడియో కాన్ఫరెన్సు ద్వారా శిక్షణ చేపట్టింది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాతో పాటు  రాష్ట్రానికి చెందిన మొత్తం 66 మంది అఖిల భారత సర్వీసు అధికారులను భారత ఎన్నికల సంఘం కేంద్ర పరిశీలకులుగా ఎంపిక చేసింది. 

కేంద్ర పరిశీలకులు అనుసరించాల్సిన విధి విధానాలను, నిర్వహించాల్సిన విధులపై శిక్షణ ఇస్తున్నారు. రాష్ట్ర సచివాలయం నుంచి 23 మంది ఐఏఎస్, 13 మంది ఐపీఎస్ అధికారులు శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఏపికి చెందిన మరో 16 మంది ఐఏఎస్​లు 14 మంది ఐపీఎస్ అధికారులు నేరుగా దిల్లీ (Delhi) లో శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.