కారులో చెలరేగిన మంటలు - వాహనం దగ్ధం - ప్రయాణికులు సేఫ్​ - car fire news in alluri district

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 10, 2024, 10:41 PM IST

Updated : Feb 11, 2024, 6:27 AM IST

Car Catches Fire in Alluri District  : అల్లూరి సీతారామరాజు జిల్లాలోని వంజరి ఘాట్ రోడ్డులో పర్యటకుల కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు పూర్తిగా వ్యాపించడంతో కారు పూర్తిగా మంటల్లో దగ్ధమైంది. జిల్లాలోని జి.మాడుగురు మండలం వంజరి ఘాట్ రోడ్డుపై శనివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐదుగురు పర్యటకులు, ప్రఖ్యాతిగాంచిన లంబసింగి ప్రాంతాన్ని చూడటానికి కారులో వెళ్లారు. అయితే లంబసింగి పర్యటన అనంతరం పాడేరుకు బయలుదేరారు. 

Fire Accident in Car : లంబసింగి నుంచి వంజరి ఘాట్ రోడ్డులోకి చేరుకునే సరికి కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే కారు దిగిపోయి దూరంగా పరుగులు తీశారు. కొద్దిసేపటికి మంటలు తీవ్రమై కారు పూర్తిగా దగ్ధమైపోయింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మంటలు తీవ్రంగా చెలరేగడంతో స్థానికులు భయందోళనకు గురయ్యారు. అయితే కారు ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.  

Last Updated : Feb 11, 2024, 6:27 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.