ఒంటెలు అక్రమ రవాణా- అన్నమయ్య జిల్లాలో నిందితులు అరెస్ట్ - Camel Smuggling Gang Arrested - CAMEL SMUGGLING GANG ARRESTED
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 6, 2024, 5:01 PM IST
|Updated : Aug 6, 2024, 5:57 PM IST
Camel Smuggling Gang Arrested: రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఒంటెలను అక్రమ రవాణా చేస్తున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం సుద్దలవాండ్లపల్లి మీదుగా ఒంటెలు తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్ నుంచి తరచూ ఒంటెలను తీసుకొచ్చి రాయచోటి, మదనపల్లి, పీలేరు, బెంగుళూరులో విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు. కొందరు వ్యాపారులు అక్రమ వ్యాపారం సాగిస్తున్నట్లు ముందస్తుగా వచ్చిన సమాచారం మేరకు వారిని గుర్తించి అరెస్టు చేశామన్నారు.
ఒంటెల అక్రమ తరలింపు వెనుక రాయచోటికి చెందిన బడా వ్యాపారుల హస్తం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ బృందాలు ఒంటెలను పరిశీలించి, అక్రమంగా తరలిస్తున్న వ్యాపారులపై పోలీసు అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పట్టుబడిన ఒంటెలను జంతు సంరక్షణశాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు తరలింపు వెనుక ఉన్న బడా వ్యాపారుల హస్తంపై దర్యాప్తు చేపట్టారు.