కృష్ణాజిల్లాలో కూలిన వంతెన - ఇసుక లారీ వెళ్తుండగా ఘటన
🎬 Watch Now: Feature Video
Bridge Collapsed in Krisha Disrict : కృష్ణా జిల్లా మోపిదేవి మండలం రావివారిపాలెం వద్ద బ్రాంచి కాలువపై భారీ లోడుతో ఇసుక టిప్పరు వెళుతుండగా ఒక్కసారిగా వంతెన (Bridge) కూలిపోయింది. మోపిదేవి కో ఆపరేటివ్ బ్యాంకు నిర్మాణానికి ఇసుకను తరలిస్తుండగా ఘటన చోటు చేసుకుంది. గతంలో వంతెన శిథిలావస్థకు చేరిందని దీనిపై ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు త్వరగా వంతెన పాటు రహదారిని పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
వంతెన కూలిపోవడంతో భారీ టిప్పర్ కాలువలో దిగబడిపోయింది. సుమారు 1200 ఎకరాల వ్యవసాయ పంట పొలాలకు ఎరువులు, దాన్యం, వ్యవసాయ పనులకు ఈ వంతెన పైనుండి వెళ్ళవలసి ఉంది. జేసిబితో టిప్పర్లో నుంచి ఇసుకను బయటకు దిగుమతి చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ వంతెన శిధిలావస్థకు చేరిందని ఎన్నిసార్లు ఇరిగేషన్ (Irrigation) అధికారులకు తెలిపినా పట్టించుకోలేదని స్థానికులు అంటున్నారు. ఎన్ని రోజులకు వంతెన నిర్మాణం చేస్తారోనని రైతులు (farmers) ఆందోల చెందుతున్నారు.