ఫాం 6తో బోగస్​ ఓట్లకు దరఖాస్తు- బీఎల్వోల పరిశీలనలో వెలుగులోకి అనేకం - fake votes through form 6

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 12, 2024, 5:38 PM IST

Bogus Votes in Anantapur Voter List: ఓటు నమోదుకు ఉపయోగించే ఫాం 6 దరఖాస్తులను దొంగ ఓట్ల నమోదుకు ఉపయోగిస్తోంది జగన్ సర్కార్. ముఖ్యమంత్రి జగన్ వైనాట్ 175 అని అంత ధీమాగా చెప్పడానికి కారణం ఇదే. తుది ఓటరు జాబితా విడుదల అయినప్పటికీ కోకల్లుగా తప్పుడు ఓట్లు ఇంకా దర్శనమిస్తున్నాయి. రోజుకు కొన్ని దొంగ ఓట్లు (Fake Votes) బట్టబయలు అవుతున్నాయి. ఇదంతా చూస్తుంటే ఎన్నికల సమయానికి అయినా దొంగ ఓట్ల ఏరివేత జరుగుతుందా అనే ప్రశ్నలు తలెత్తున్నాయి.

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో పలు పోలింగ్ స్టేషన్ల (polling station)లో తప్పుడు ఇంటి నెంబర్లతో ఓటరు నమోదుకు దరఖాస్తు చేశారని బీఎల్​ఏ (BLA) తెలిపాడు. మున్సిపాలిటీలో ఐదు నుంచి పది వరకు ఫారం 6 (form 6) ద్వారా దరఖాస్తు చేసినట్లు తమ పరిశీలనలో తేలిందన్నారు. కళ్యాణదుర్గం నుంచే కాక ఇతర ప్రాంతాల నుంచి కూడా రకరకాల పేర్లతో ఓట్లను సృష్టించారని తమ పరిశీలనలో తేలిందని స్పష్టం చేశారు. సుమారు 200 నుంచి 300 దాకా ఓట్లను నమోదు చేసే ప్రయత్నం చేశారన్నారు. ఫారం 6 ఉన్న అడ్రస్​కు వెళ్లి పరిశీలిస్తే అది తప్పుడు చిరునామాగా తేలిందని, ఈ విషయం ఎన్నికల అధికారి దృష్టికి తీసుకువెళ్తున్నట్లు బీఎల్​ఓ హరి వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.