'అందరూ సేఫ్ -మత్స్యకారుల ఆచూకీ లభ్యం' - Boat Missing Location Available - BOAT MISSING LOCATION AVAILABLE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 3, 2024, 10:33 AM IST
Boat Missing Location Available in Visakhapatnam District : సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల ఆచూకీని అధికారులు ఎట్టకేలకు గుర్తించారు. విశాఖ హార్బర్ నుంచి వేటకు వెళ్లిన మత్య్సకారులు అప్పికొండ తీరానికి చేరుకున్నట్లు ఫిషింగ్, కోస్ట్ గార్డ్ అధికారులు తెలియజేశారు. గల్లంతైన ఆరుగురు మత్య్సకారులు క్షేమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
Vizag Fishing Harbour : సముద్రంలోని అలల ఉద్ధృతికి బోటు బోల్తా పడిందని అధికారులు వెల్లడించారు. దీంతో దెబ్బతిన్న బోటు పైభాగంలో మత్స్యకారులు ఉండిపోయారని తెలిపారు. మత్స్యకారులు మంగళవారం రాత్రి వరకు బిక్కుబిక్కుమంటూ గడిపారని పేర్కొన్నారు. గల్లంతైన మత్స్యకారుల కోసం ఫిషింగ్, కోస్ట్ గార్డ్ల గాలింపు చర్యల్లో భాగంగా వారి ఆచూకీ లభ్యమయినట్లు అధికారులు తెలిపారు.
People Protest YCP MLA Vasupalli Ganesh Kumar : గల్లంతైన మత్స్యకారుల బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్కు నిరసన సెగ తగిలింది. సకాలంలో ఎందుకు స్పందించలేదంటూ ఎమ్మెల్యేను స్థానికులు నిలదీశారు.