దొనకొండ ఇండస్ట్రియల్ కారిడార్,కనిగిరి నిమ్జ్‌లకు భారీగా నిధులు:లంకా దినకర్ - Central Funds For Prakasam - CENTRAL FUNDS FOR PRAKASAM
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 25, 2024, 10:33 PM IST
BJP Leader Lanka Dinkar On Central Funds For Prakasam District : వెనుకబడిన ప్రకాశం జిల్లాకు కేంద్రం బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు, ప్రాజెక్టులు మంజూరు చేసేందుకు ప్రాధాన్యం కల్పించడం హర్షనీయమని బీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి లంకా దినకర్ తెలిపారు. ఉమ్మడి జిల్లాలో మంత్రులు, ప్రజాప్రతినిధులు సహకారం, సమన్వయంతో జిల్లాలో చేపట్టబోయే కార్యక్రమాలపై ప్రణాళికలు రూపొందిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు : వికసిత్ భారత్ 2047, వికసిత్ ఆంధ్ర, వికసిత్ ప్రకాశం నినాదంతో జిల్లా అభివృద్దికి కృషి చేస్తామని లంకా దినకర్ స్పష్టం చేశారు. దొనకొండ ఇండస్ట్రియల్ కారిడార్, కనిగిరి నిమ్జ్‌తో పాటు, భూగర్భ జలాభివృద్ధి, రహదారులు అభివృద్ధికి జిల్లాకు అదనపు నిధులు వస్తాయని ఆయన తెలిపారు. వెనుకబడిన జిల్లాల జాబితాలో ప్రకాశాన్ని ప్రకటించడాన్ని కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్‌కు నిధులు అందించినందుకు కూడా ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షడు శివారెడ్డి, ఆ పార్టీ నేతలు పాల్గొన్నారు.