పురందేశ్వరి రాజీనామా ఫేక్ లెటర్‌- వైసీపీ ఘనకార్యమే: బీజేపీ - BJP Complaint to Cybercrime - BJP COMPLAINT TO CYBERCRIME

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 23, 2024, 7:42 PM IST

BJP Complaint to Cybercrime on Purandeshwari Fake Resignation Letter: పురందేశ్వరి రాజీనామా ఫేక్ లెటర్ సృష్టికి వైసీపీ సోషల్ మీడియానే కారణమని బీజేపీ రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షుడు షేక్ బాజీ ధ్వజమెత్తారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పేరుతో ఫేక్‌ లెటర్‌ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేశారు. సంధ్య మెరైన్స్ నుంచి బయటకి వెళ్లిపోయిన ఆర్థిక నేరస్థుడు వీరభద్రరావు సంధ్య ఆక్వా ఎక్స్ పోర్టు కంపెనీని స్థాపించారన్నారు. సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్టు కంపెనీకి వైసీపీ నాయకులతో సంబంధాలున్నాయని గుర్తు చేశారు. అబద్ధాలు ప్రచారం చేసి ప్రజల మనసుల్లో తప్పుడు ముద్ర వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 

చంద్రబాబును అరెస్టు చేసినపుడు ఒక నకిలీ లెటర్ హెడ్​ వచ్చిందని అప్పుడు దానిని ఖండించామన్నారు. అబద్ధాలు ప్రచారం చేసి ప్రజల మనసుల్లో వైసీపీ నేతలు తప్పుడు ముద్ర వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీబీఐ దర్యాప్తులో వైసీపీ నేతలు ముద్దాయిలు కానున్నారని తెలిపారు. వైసీపీ కుట్ర కోణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూడక తప్పదని బాజీ అన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.