మత్స్యకారుల వలలో బహుబలి చేప - బరువు ఎంతంటే? - big fish caught at machilipatnam

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 29, 2024, 10:58 AM IST

thumbnail
మత్స్యకారుల వలలో బహుబలి చేప - బరువు ఎంతంటే? (ETV Bharat)

Big Fish Caught by Fishermen at Machilipatnam : చూసేందుకు తిమింగిలం పరిమాణంలో ఉంది. ఒంటిపై తెల్లటి మచ్చలు ఉన్నాయి. 1500 కిలోల బరువున్న ఈ చేపను చూసిన వాళ్లు అమ్మో ఇంతపెద్ద చేపా అంటున్నారు. మరి ఇంతపెద్ద చేప మత్స్యకారుల వేటలో దోరికిందంటే నమ్ముతారా అని అడిగితే అవుననే సమాధానం చెప్పాలి. కృష్ణా జిల్లా మచిలీపట్నం గిలకలదిండిలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు ఈ టేకు చేప చిక్కిందని చెప్తున్నారు. మత్స్యకారులు క్రేన్ సాయంతో టేకు చేపను బయటకు తీశారు. మచిలీపట్నం నుంచి చెన్నై వ్యాపారస్తులు ఈ టేకు చేపను కొనుగోలు చేశారు.

నాలుగు రోజుల క్రితం కూడా సుమారు 500 కిలోల బరువున్న వేల్​ షార్క్​( బొక్కు సొర చేప) మత్స్యకారుల వలకు చిక్కింది.  ఈ రకం సొర చేపలు తినేందుకు ఉపయోగపడవు. దీంతో మత్స్యకారులు ఒడ్డునే వదిలేసి వెళ్లిపోయారు. సముద్ర జలాల్లోని కాలుష్యాన్ని నివారించడంలో వేల్​ షార్క్​ కీలకపాత్ర పోషిస్తాయి. ఈ విషయం తెలియనివారు వాటిని పట్టి, తీసుకొచ్చి ఒడ్డున వదిలేస్తున్నారు. వీటీపై అధికారులు మత్యుకారులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.