చంద్రబాబు సీఎం అయ్యాక మీ సమస్యలన్నీ పరిష్కరిస్తారు: భువనేశ్వరి - Bhuvaneshwari Nijam Gelavali Yatra - BHUVANESHWARI NIJAM GELAVALI YATRA
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 30, 2024, 9:57 AM IST
Bhuvaneshwari Nijam Gelavali Yatra Completed in Krishna District : తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన ' నిజం గెలవాలి' పర్యటన ఉమ్మడి తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో ముగిసింది. పోలవరం (Polavaram), చింతలపూడి, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, గన్నవరం, నూజివీడు, గుడివాడ, పెనమలూరు, మచిలీపట్నం, అవనిగడ్డ నియోజకవర్గాల్లో ఆమె పర్యటించారు. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్టు సమయంలో మనస్థాపంతో మృతి చెందిన 22మంది కార్యకర్తల కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు. వారకి భరోసా కల్పించారు. పర్యటనలో ఆమెకు అడుగడుగునా కార్యకర్తలు, మహిళలు ఘన స్వాగతం పలికారు.
Nara Bhuvaneshwari Nijam Gelavali : మచిలీపట్నంలో గంగపుత్రుల కుటుంబాలతో ముఖాముఖి నిర్వహించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక మీ సమస్యలన్నీ పరిష్కరిస్తారని భువనేశ్వరి (Bhuvaneshwari) వారికి భరోసా ఇచ్చారు. ప్రజలు తమ ఓటు హక్కును నిజమైన, తమకు అండగా ఉండే నాయకుడ్ని ఎంచుకునేందుకు ఉపయోగించాలని సూచించారు.