యధుభూషణ్​కు ఎన్నికల బాధ్యతలు వద్దు - ఈసీకి భూమిరెడ్డి ఫిర్యాదు - Bhumi Reddy Ram Gopal Reddy

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 10, 2024, 2:16 PM IST

Bhumi Reddy Ram Gopal Reddy complained Yadhubhushan Reddy At Election Officer : వైఎస్సార్ జిల్లాలో డ్వామా పీడీగా ఉన్న యధుభూషణ్ రెడ్డికి ఎన్నికల బాధ్యతలు కేటాయించవద్దంటూ తెలుగుదేశం ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాలరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. యధుభూషణ్ రెడ్డి పదవీ విరమణ పొందాక వైసీపీ ప్రభుత్వం ఆయన పదవీ కాలం పొడిగించిందని గుర్తు చేశారు. ఎన్నికల పరిశీలకులకు ప్రోటోకాల్ ఏర్పాట్లు చేసే బాధ్యతలను యధుభూషణ్ రెడ్డికి అప్పగించారని పేర్కొన్నారు. ఆయన నేతృత్వంలో అధికార దుర్వినియోగం జరిగే అవకాశం ఉందని ఆరోపించారు. 

ఎన్నికల ప్రక్రియలో ఉత్పన్నమయ్యే సమస్యలను ప్రజలు, పార్టీలు కేంద్ర ఎన్నికల పరిశీలకుల దృష్టికి తీసుకువచ్చే క్రమంలో భాష సమస్య వస్తుందని భూమిరెడ్డి పేర్కొన్నారు. యధుభూషణ్​ పార్టీకి అనుకూలమైన అధికారి కాబట్టి విషయాల్ని తర్జుమా చేసే సమయంలో సరిగ్గా చేయకపోవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం మాన్యువల్​లో కూడా సర్వీస్​ను పొడిగించిన అధికారులను ఉపయోగించుకోకూడదని సృష్టంగా తెలిపిందని పేర్కొన్నారు. యధుభూషణ్​ రెడ్డి ఎక్కడ కూడా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా చెయ్యాలని, అవసరమైతే ఆయన కడప జిల్లాలో లేకుండా చేయాలని ఫిర్యాదులో తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.