బాబోయ్ ఎలుగుబంటి వచ్చేసింది- శ్రీకాకుళం జిల్లా ప్రజలను వణికిస్తున్న భల్లూకాలు - Bear Roars at Makannapalli - BEAR ROARS AT MAKANNAPALLI
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09-04-2024/640-480-21181788-thumbnail-16x9-bear-roaring-on-roads-at-makannapalli.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 9, 2024, 12:57 PM IST
Bear Roaring on Roads at Makannapalli: శ్రీకాకుళం జిల్లా పలాస మండలం మాకన్నపల్లిలో ఎలుగుబంటి హల్‌చల్ చేసింది. ఆదివారం రాత్రి ఏడు గంటల సమయంలో రోడ్డుపై స్వైర విహారం చేసింది. దీంతో రాత్రి వేళ బయటకు వెళ్లాలంటే గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. భల్లూకం వచ్చినప్పుడు ప్రజలెవ్వరూ కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని, ఒంటరిగా బయటికి వెళ్లవద్దని జాగ్రత్తగా ఉండాలని అటవీ శాఖ అధికారులు స్థానికులకు సూచించారు. ఎలుగుబంటి సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని బంధించేందుకు చర్యలు ప్రారంభించారు.
గతంలో: శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం అనకాపల్లి సమీపంలో ముగ్గురిపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరొకరిని ఆస్పత్రికి తరలించారు. తోటలో పనికి వెళ్లిన సమయంలో అటుగా వచ్చిన ఎలుగుబంటి వీరిపై దాడి చేసింది. గతంలో స్థానికులపై ఎలుగుబంటి 3 సార్లు దాడి చేసిందని దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.