రాబోయే ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదు: వెనిగండ్ల రాము

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 7, 2024, 8:48 PM IST

thumbnail

Babu Surety Future Guarantee Program in Krishna District : కృష్ణా జిల్లా గుడివాడ టీడీపీ - జనసేన నేతలు వెనిగండ్ల రాము, రావి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వలివర్తిపాడులో 'బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ' కార్యక్రమం నిర్వహించారు. 'బాబు ఘ్యారిటీ భవిష్యత్​కు గ్యారెంటీ' కార్యక్రమం నిర్వహించిన తనకు ప్రజలు ఘన స్వాగతం పలికారని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామస్థులు తమ వెంట నడవటం సంతోషకరమని పేర్కొన్నారు.

రానున్న ఎన్నికల్లో తమ పార్టీ అఖండ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అధికార ప్రభుత్వంపై నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు. టీడీపీ - జనసేన విజయం కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యల పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు. చంద్రబాబు సహకారంతో గుడివాడ అభివృద్ధికి ప్రత్యేక నిధులు తీసుకొస్తామని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.