విశాఖలో ఏవియేషన్ సెక్యూరిటీ కల్చర్ వీక్-2024 - Aviation Security Culture Week 2024 - AVIATION SECURITY CULTURE WEEK 2024

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 9, 2024, 2:27 PM IST

Aviation Security Culture Week 2024 in Visakha : ఏవియేషన్ సెక్యూరిటీ కల్చర్ వీక్ 2024 విశాఖలో సందడిగా సాగుతోంది. 2వ ఏవియేషన్ సెక్యూరిటీ కల్చర్ వీక్ విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈనెల 11 వరకు నిర్వహిస్తున్నారు. ఎయిర్‌పోర్ట్ అథారిటీ సిబ్బంది, CISF , ఎయిర్‌లైన్స్, ఎయిర్‌పోర్ట్‌లో పనిచేస్తున్న అన్ని ఎంటీటీల సిబ్బంది ఈ ఏవియేషన్ సెక్యూరిటీ కల్చర్ వీక్‌లో పాల్గొంటున్నారు. సృజనాత్మకత, సరదా కార్యకలాపాలను ప్రదర్శించడం ద్వారా ప్రయాణికులకు ఏవియేషన్ సెక్యూరిటీపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఎయిర్‌ పోర్ట్ ప్రాంగణంలో వాకథాన్ నిర్వహించారు. అందులో (ఏఏఐ) AAI సిబ్బంది, CISF (సీఐఎస్​ఎఫ్​) సిబ్బంది, ఎయిర్‌లైన్స్​ అన్ని సంస్థల సిబ్బంది పాల్గొన్నారు. 

ఇందులో భాగంగా సిబ్బంది విమానయాన సేవల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమం విమానయాన భద్రత గురించి ప్రయాణికులకు అవగాహనను పెంపొందించడం, సాధారణ ప్రజలలో అప్రమత్తత సంస్కృతిని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. 'ఎఫెక్టివ్ డివెస్ట్‌మెంట్ ద్వారా ప్రయాణికుల భద్రతను మెరుగుపరచడం' అనే థీమ్‌తో, ఈ సంవత్సరం ప్రచారం భద్రత అనేది భాగస్వామ్య బాధ్యత అనే సూత్రాన్ని నొక్కి చెబుతుంది. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.