అనుమానాస్పదంగా ఆటో డ్రైవర్ మృతి - ఆస్తి తగాదాలే కారణమా? - Auto Driver Murder in Satya sai - AUTO DRIVER MURDER IN SATYA SAI
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 20, 2024, 2:12 PM IST
Auto Driver Murder in Satya sai District : సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సీసీ కొత్తకోట వద్ద తాడిమర్రి సూర్యనారాయణ (45 ) అనే ఆటో డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. చిన్న కొత్తపల్లి మండలం వెల్దుర్తికి చెందిన సూర్యనారాయణ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి ఆటోలో ఇంటి వద్ద నుంచి వెళ్లిన సూర్యనారాయణ శనివారం ఉదయం సీసీ కొత్తకోట వద్ద ఆటో పక్కనే విగత జీవగా పడివున్నాడు.
అచేతనంగా రక్తపు మడుగులో ఉన్న సూర్యనారాయణను గమనించిన స్థానికులు ధర్మవరం గ్రామీణ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నామన్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు విషయం తెలియజేశారు. సూర్యనారాయణకు బంధువులకు గ్రామంలో ఉన్న ఆస్తితగాదాలే హత్యకు కారణమని సూర్యనారాయణ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టామన్నారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయన్నారు.